శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (13:44 IST)

మరో షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన మీరా మిథున్, ట్రాన్స్‌జెండర్ అప్సరా రెడ్డితో నాకు ప్రాణభయం

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
సూపర్ మోడల్ మీరా మిథున్ షాకింగ్ వీడియోను మళ్ళీ విడుదల చేసింది. తమిళ స్టార్ నటులు విజయ్, సూర్యలకు శిరసు వంచి క్షమాపణలు చెపుతున్నట్లు తెలిపింది. వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడటానికి కారణం ఎఐఎడిఎంకె లీడర్, ట్సాన్స్‌‍జెండర్ అప్సర రెడ్డి అంటూ ఆరోపించింది.
 
కాగా గత కొన్ని రోజులుగా మీరా మిథున్ నటుడు సూర్య, విజయ్‌ల పైన తీవ్ర ఆరోపణలు చేసింది. నెపోటిజంకి వారు కారణమనీ, వాళ్లిద్దరూ ఓ మాఫియా అంటూ వ్యాఖ్యలు చేసింది. దీనితో సూర్య, విజయ్ అభిమానులు ఆమెపై దుమ్మెత్తి పోశారు. ఐతే దీనిపై సంయమనం పాటించాలని అటు సూర్య, ఇటు విజయ్ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
 
ఇప్పుడు ఈ వ్యవహారంపై మీరా మిథున్ స్పందించింది. ఆ నటులపై ఆరోపణలు చేయడానికి కారణం ట్రాన్స్‌జెండర్ అప్సరా రెడ్డి అంటూ ఆరోపించింది. నేనీ మాటలు చెప్పిన దగ్గర్నుంచి నన్ను చంపేందుకు ఓ గ్యాంగ్ చూస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. అప్సర రెడ్డిని అన్నాడీఎంకె పార్టీ నుంచి వెంటనే తొలగించాలని మీరా మిథున్ ఎఐఎడిఎంకెకు విజ్ఞప్తి చేసింది.
 
కాగా మీరా మిథున్ చేస్తున్న ఆరోపణలను తమ లీడర్ అప్సరా రెడ్డి పట్టించుకోరంటూ ఆమె అభిమానులు తేల్చేశారు. ఆమె ఎప్పుడు ఎలా.. ఎవరిపైన ఆరోపణలు చేస్తుందో ఎవరికీ తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఇదిలావుంటే కొన్ని రోజుల క్రితం మీరా మిథున్ తన చిత్రానికి సంబంధించిన స్టిల్ అంటూ ఓ అభ్యంతరకర పోస్టు పెట్టి చర్చకు తెరతీసింది. చూడండి ఆ పోస్టును క్రింది లింకులో...

చెక్ అవుట్ మై హాట్‌నెస్ అంటూ ఫోటో పెట్టిన నటి, ప్రైవేట్ పార్ట్స్ పైన కుర్రాడి చేయి