శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (18:16 IST)

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

TV, Cinema Artist Association
TV, Cinema Artist Association
నూతన సంవత్సర ఆరంభం సాక్షిగా తెలుగు టీవీ, సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ రెండు ముక్కలు కాబోతుందని తెలుస్తోంది. అసోసియేషన్ ఏర్పడి 25 ఏళ్ళు అయింది. ప్రస్తుతం దీనికి వినోదబాల అధ్యక్షుడిగా వున్నారు. విజయ యాదవ్ కార్యదర్శిగా వున్నారు. కాగా, గత కొన్నేళ్ళుగా అసోసియేషన్ లో పరబాషా నటీనటులు సభ్యత్వ విషయంలో పొరపొచ్చాలు వచ్చాయి. కాలమార్పులతోపాటు ఇందులో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న కొందరు రెండో అసోసియేషన్ గా పెట్టి ముక్కలు చేయాలని చూసినట్లు తెలుస్తోంది. దీనికి పరబాషా నటీమణులు, నటులతో సభ్యత్వంగా తీసుకుని వారిని తనవైపు లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో గాయకుడు, నటుడు అయిన ఓ ప్రముఖ నటుడు తెలుగులోనేకాక, ఇతర భాషల్లోనూ టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. 
 
ఇటీవలే ఓ మహిళ నటి సీనియర్ నటుడు నిర్మాతగా మారి తీస్తున్న సీరియల్ కు సరైన సమయం ఇవ్వకపోవడంతో పాటు లాయర్ తో అసోసియేషన్ పై విమర్శలు దాడిచేసింది. అంతేకాక మహిళలను అసోసియేషన్ లో నొక్కేస్తున్నారు. పైకి రాకుండా చేస్తున్నారంటూ జనరల్ బాడీలో ఏకరువు పెట్టింది. అసోసియేషన్ మీటింగ్ తేల్చుకోవాల్సిన విషయాన్ని జనరల్ బాడీలో పెట్టడంతో సీనియర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మహిళా ఆర్టిస్టు వెనుక రెండో వర్గం ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. జనరల్ బాడీలో పరబాషా నటీనటులు వుండకూడదనీ, టీవీ ఛానల్స్ పరిమితులు వుండాలని చేసిన పోరాటం కూడా సన్నగిల్లింది. ఫైనల్ జనవరి నెలాఖరున ఎన్నికలు జరపాలని జి.బి. తీర్మానం చేసింది.