శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (15:45 IST)

సినిమాల ప్లాప్ లో మీడియా పాత్ర - అందుకే నిర్మాతలంతా ఓ నిర్ణయానికి వచ్చాం : దిల్ రాజు

Dil raju style
Dil raju style
తామంతా ఇప్పటివరకు చేసిన కొన్ని తప్పులను సరిద్దుకునే సమయం ఆసన్నమైందని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇటీవలే ఓ సందర్భంలో థియేటర్లకు ప్రేక్షకులు రావడంలేదనీ దానితో చేసేదిలేక సింగిల్ థియేటర్లన్నీ కమర్షియల్ కాంప్లెక్స్ గా మారబోతున్నాయని అన్నారు. ఇదంతా తన అక్కసును వెళ్ళగక్కారని పలువురు విమర్శించారు. దీనిపై నేడు సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు.
 
అసలు సినిమాలు ఆడకపోవడంలోకూడా మీడియా పాత్ర చాలా వుంది. అసలు మిమ్మల్ని పలానా సినిమా గురించి ఇలా అట. అలా అట.. అని మిమ్మల్ని ఎవరు రాయమన్నారంటూ.. ప్రశ్నలు సంధించారు. అనంతరం తమ పాత్ర కూడా వుందని చెప్పారు. 
 
నిర్మాతలంతా కొన్ని కరెక్షన్స్ చేసుకోబోతున్నాం. అందులో టికెట్ రేట్లు తగ్గించే ప్రయత్నంలో వున్నాం. అలాగే కథల ఎంపికలోనూ, ఇతరత్రా విషయాలలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని ఆ విషయాలను త్వరలో తెలియజేస్తామని అన్నారు. అదేవిదంగా ఏదైనా జరిగితే వెంటనే ఇలా అటగదా. అలా అటగదా.. అంటూ వార్తలు మీడియా రాసేస్తున్నాయి. మీకు ఎవరు రాయమని చెప్పారు? అంటూ సెటైరిక్ గా మాట్లాడారు. ఏది ఏమైనా మీడియా కూడా ఇందులో భాగమేనని అన్నారు.