సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 18 మే 2022 (10:20 IST)

బాలయ్య ఇంటి గేటుని జీపుతో ఢీకొట్టిన యువతి

Balakrishna
నందమూరి నటసింహం బాలయ్య ఇంటి గేటుని ఓ యువతి జీపుతో వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో బాలయ్య ఇంటి చుట్టూ వేసిన ఫెన్సింగ్, గోడ కాస్త దెబ్బతిన్నాయి.

 
పూర్తి వివరాలు చూస్తే... మంగళవారం నాడు జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45లో వున్న బాలయ్య ఇంటివైపు ఓ జీపు వేగంగా వచ్చి బాలయ్య ఇంటి గేటును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ క్రమంలో బాలయ్య ఇంటి చుట్టూ వేసిన ఫెన్సింగ్, చెట్లు, ప్రహరీ గోడ పాక్షికంగా దెబ్బతిన్నాయి.

 
విషయం తెలియడంతో అక్కడికి భారీగా జనం గుమిగూడారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించగా... అంబులెన్సుకి దారి ఇచ్చేందుకు జీబుని పక్కకి తప్పించగా అది అదుపుతప్పి ఇలా జరిగిందని ఆ జీపుని డ్రైవ్ చేస్తున్న యువతి చెప్పింది. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.