శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (16:35 IST)

బెల్లంకొండ సురేష్ కారులో అద్దాలు పగిలిపోయాయి.. రూ.50వేలు చోరీ

Bellamkonda Suresh, VV.Vinayak
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. జర్నలిస్ట్ కాలనీలో గురువారం మధ్యాహ్నం తన ఆఫీస్ ముందు సురేష్ కారు పార్క్ చేశారు. శుక్రవారం ఉదయం చూడగా ఎడమ వైపు సీటు వద్ద కారు అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. 
 
జర్నలిస్ట్ కాలనీలో గురువారం మధ్యాహ్నం తన ఆఫీస్ ముందు సురేష్ కారు పార్క్ చేశారు. కారులో 50 వేల రూపాయల నగదు, 11 ఖరీదైన మద్యం బాటిళ్లు మాయమైనట్టు గుర్తించారు. 
 
దీంతో బెల్లంకొండ సురేష్ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.