ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 22 జులై 2023 (17:09 IST)

ఆర్.కె టెలీ షో లో అప్పుడు రాజమౌళి..ఇప్పుడు శేఖర్ గంగనమోని

Rajamouli-RK
Rajamouli-RK
తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుత చిత్రాలను రూపొందించిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు నిర్మాతగా మారి తన ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై శాంతి నివాసం సీరియల్ తో ప్రముఖ దర్శకుడు రాజమౌళిని పరిచయం చేశారు. ఇప్పుడు అదే బ్యానర్ 25 వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రాఘవేంద్ర రావు మొదటిసారి చిత్ర నిర్మాణం చేపట్టి ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘‘సర్కారు నౌకరి’’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. భావనా వళపండల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
 
RK at Sarkar Naukari set
RK at Sarkar Naukari set
ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ లో చూపించిన మూవీ మేకింగ్ చూస్తే నిర్మాతగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్లెజంట్ మూవీగా ‘‘సర్కారు నౌకరి’’ ని రూపొందించారు దర్శకుడు గంగనమోని శేఖర్. ప్రస్తుతం తుది దశ పనుల్లో ఉన్న ‘‘సర్కారు నౌకరి’’ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో ఆకాష్, భావనా వళపండల్, తనికెళ్ల భరణి,  మహాదేవ్, మధులత, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన,రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.