బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 29 జూన్ 2023 (17:41 IST)

ఆస్కార్‌ కమిటీలో ఆర్‌.ఆర్‌.ఆర్‌.టీమ్‌- రాజమౌళి శుభాకాంక్షలు

gobal star charan
gobal star charan
ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాకు ఆస్కార్‌ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో గొప్ప కీర్తి వారికి దక్కింది. 2023 అవార్డు కమిటీలో ఆరుగురు సభ్యులకు అవకాశం దక్కింది. ఈ విషయం తెలిసిన వెంటనే దర్శకుడు రాజమౌళి వారికి శుభాకాంక్షలు తెలిపారు. చిత్రం ఏమంటే కమిటీలో రాజమౌళి పేరు లేదు. ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ పేరుతో కమిటీలో ఈ ఏడాది 398 మందికి సభ్యత్వం కలిపించింది. అందులో ఆరుగురు ఆర్‌.ఆర్‌.ఆర్‌.కు పనిచేసిన వారే. ఇది చాలా అరుదైన విషయం.
 
ఈ కమిటీలో రామ్‌చరణ్‌, ఎన్‌.టి.ఆర్‌, కీరవాణి, చంద్రబోస్‌, సెంథిల్‌ కుమార్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ చేసిన సాబు సిరిల్‌ ఆస్కార్‌ కమిటీలో స్థానం పొందారు. ఇప్పటికే రామ్‌చరణ్‌కు కుమార్తె పుట్టడంతో ఆ దేవుని ఆశీస్సులు వున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదో అరుదైన అవకాశం రావడంపట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 
మరోవైపు ఎన్‌.టి.ఆర్‌. అభిమానులుకూడా చాలా సంతోషంగా వున్నారు. ఇప్పటికే ఎన్‌.టి.ఆర్‌.కు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.