బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 మే 2023 (11:08 IST)

పుట్టినరోజును అలా జరుపుకున్న గాయని సునీత

Sunitha
ప్రముఖ టాలీవుడ్ గాయని సునీత తన పుట్టినరోజును జరుపుకున్నారు. మే 10వ తేదీన సునీత ప్రియతముల మధ్య అభిమానుల హృదయపూర్వక శుభాకాంక్షల మధ్య జరుపుకున్నారు. తన వేడుకల్లో భాగంగా నిరుపేదలకు ఆహారాన్ని అందజేసి అందరికి స్వయంగా పంచింది. సునీత ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో, వృద్ధులు ఆమెను ఆశీర్వదించడం, అభినందించడం చూడవచ్చు. 
 
సునీత తనకు లభించిన ప్రేమ, ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలుపుతూ తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇస్తూ "నా రోజు ఇలా గడిచింది.. నిజంగా ఆశీర్వదించబడింది. మీ అందరి నుండి ప్రేమ, ఆప్యాయతలను పొందడం నా అదృష్టం.. నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిగా ఉంటాను." అంటూ పోస్టు చేసింది.