మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 16 జులై 2017 (15:10 IST)

ఉత్తరాది హీరోయిన్ల వల్లే డ్రగ్స్ కల్చర్‌‌కు పునాది... అశోక్ కుమార్

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ కల్చర్‌ ఇపుడు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్‌ కేసులో పలువురు హీరో, హీరోయిన్లు, దర్శకులు, బడా నిర్మాతల కుమారులకు సంబంధం ఉన్నట్టు వార్తలు గుప్పు

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ కల్చర్‌ ఇపుడు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్‌ కేసులో పలువురు హీరో, హీరోయిన్లు, దర్శకులు, బడా నిర్మాతల కుమారులకు సంబంధం ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు అశోక్ కుమార్ స్పందించారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ... ఎవరో చేసిన తప్పును పరిశ్రమ మొత్తానికి ఆపాదించడం సరికాదన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఈ తరహా సంస్కృతి లేదని, ముఖ్యంగా ఉత్తరాది నుంచి హీరోయిన్లు రావడం మొదలైన తర్వాతే కాస్మొపాలిటన్‌ సిటీ కల్చర్‌ వచ్చిందన్నారు. డ్రగ్స్‌ కేసులో కొంతమంది సినీ ప్రముఖులు ఉన్నా టాలీవుడ్‌ మొత్తంపై ముద్ర వేయడం సరికాదన్నారు.