శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 28 జులై 2018 (16:05 IST)

నటి అన్నపూర్ణ దత్తపుత్రిక ఆత్మహత్య.. ఎందుకంటే...

తెలుగు సీనియర్ నటి అన్నపూర్ణ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి యేడాది వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమని వైద్యులు అంటున్నారు. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివర

తెలుగు సీనియర్ నటి అన్నపూర్ణ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి యేడాది వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమని వైద్యులు అంటున్నారు. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తెలుగు చిత్రాల్లో తల్లి, అత్త వంటి పాత్రలు వేస్తూ మంచి నటిగా గుర్తింపు పొందిన నటి అన్నపూర్ణ. ఆమెకు పిల్లలు లేకపోవడంతో కీర్తి అనే యువతిని దత్తత తీసుకుంది. ఈమెకు మూడేళ్ల క్రితమే వివాహం చేశారు. 
 
కీర్తి భర్త వెంకట కృష్ణ కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌లోని భారత ఆహార సంస్థలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. వీరికి సంవత్సరం వయసున్న కొడుకున్నాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో కృష్టా అపార్ట్‌మెంట్‌లోని గోదావరి ఫ్లాట్‌లో కీర్తి దంపతులు నివాసం ఉంటున్నారు. 
 
అయితే, కీర్తి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీనికితోడు కీర్తి బిడ్డకు సరిగా మాటలు రాకపోవడంతో ఒక యేడాదిగా స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. దీనికితోడు భర్తతో కూడా మనస్పర్థలు తలెత్తినట్టు సమాచారం. దీంతో కీర్తి కొద్ది రోజులుగా ఢిఫ్రెషన్‌లోకి వెళ్ళింది. 
 
ఈ కారణాల రీత్యా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కి పోలీసులు తరలించారు. కీర్తి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అనుమానాస్పదమృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.