శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (18:16 IST)

త్రిష టిక్ టాక్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్.. డ్యాన్స్ అదుర్స్

వయసు మీద పడినా ఎప్పటికీ స్వీట్ 16గా కనిపించే చెన్నై చంద్రం త్రిషకు ప్రస్తుతం సినిమా ఆఫర్లు వెన్నంటి వున్నాయి. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు చిరు 152వ చిత్రంలో నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో పాటు పరమపదం విలయాట్టు,గర్జనై, రామ్ తదితర చిత్రాలలో నటిస్తుంది.

కానీ ప్రస్తుతం కరోనా లాకౌ డౌన్ కారణంగా సెలెబ్రిటీలతో పాటు ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన త్రిష.. పెంపుడు జంతువులతో ఆడుకుంటూ సమయం దొరికినప్పుడు ఫ్రెండ్స్‌తో వీడియో చాట్ చేస్తూ సమయం గడుపుతుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో త్రిష పోస్టు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

త్రిష తాజాగా ప్రముఖ వీడియో మేకింగ్ ప్లాట్ ఫాం టిక్ టాక్‌లోకి అడుగుపెట్టింది. పలు వీడియోలు చేస్తూ నెటిజన్స్‌కి మంచి వినోదాన్ని అందిస్తుంది. హాలీవుడ్ గాయని మేగాన్ నీ స్టాలియన్ ఆలపించిన సేవాజ్‌.. అనే పాటకి డ్యాన్స్ చేసి తొలి వీడియోగా దీనిని పోస్ట్ చేసింది త్రిష. త్రిష డ్యాన్స్ వీడియోకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.