గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 25 జనవరి 2024 (17:53 IST)

డైరెక్టర్ మారుతి సమర్పిస్తున్న ట్రూ లవర్ సినిమా ఫస్ట్ లుక్

True Lover first look
True Lover first look
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "ట్రూ లవర్". ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాకు తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్ పై స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు.
 
ఇవాళ "ట్రూ లవర్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో గాయాలతో ఉన్న హీరో...ఆలోచిస్తూ ఎమోషనల్ గా కనిపిస్తున్నారు. ప్రేమికుల రోజున ఈ లవర్ ను మర్చిపోకండి అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ పై రాసిన క్యాప్షన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక ఇంటెన్స్ లవ్ స్టోరిని ఈ సినిమాలో చూపిస్తామనే ప్రామిస్ మేకర్స్ ఇస్తున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేశారు. త్వరలోనే ట్రూ లవర్ సినిమా రిలీజ్ డేట్ న అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.
 
నటీనటులు - మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి, శరవణన్, గీత కైలాసం, హరీశ్ కుమార్, నిఖిల శంకర్, రిని, పింటు పండు, అరుణాచలేశ్వరన్ తదితరులు