శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2022 (10:58 IST)

ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువనటి

tunisha sharma
బాలీవుడ్ యువ నటి తునీషా శర్మ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె 20 యేళ్లకే ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. ఓ సీరియల్ షూటింగులో ఉన్న తునీషా సెట్స్‌లో ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. దీని గమనించిన సెట్స్ సిబ్బంది వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు.. తునీషా శర్మ సహ నటుడు సీజన్ మహ్మద్ మేకప్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. షూటింగ్ విరామం తర్వాత తన గదికి వచ్చిన సీజన్ తన గదిలాక్ చేసి ఉండటంతో తలుపు తెరవాలని గట్టిగా అరిచాడు. తలుపును గట్టిగా తన్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో డోర్ పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా, తునీషా శర్మ అప్పటికే అపస్మారకస్థితిలో పడివుంది. 
 
దీంతో కొంతమందితో ఆస్పత్రికి తరలించారు. ఈమె 13 యేళ్లకే బాలనటిగా సీరియల్స్‌లో నటించిన తునీషా శర్మ.. పలు సినిమానాల్లో కూడా నటించారు. ఫితూర్ చిత్రంలో కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్రను పోషించారు. వచ్చే నెల 14వ తేదీన తునీషా తన 21వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఇంతలోనె ఆమె ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.