గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (22:32 IST)

ప్రముఖ యువనటి తునిషా శర్మ ఆత్మహత్య.. కారణం ఏమిటి?

Tunisha Sharma
Tunisha Sharma
ప్రముఖ యువనటి తునిషా శర్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వార్త విన్న సినీ జనం దిగ్భ్రాంతికి గురైంది. ప్రస్తుతం యువ నటులు ఒత్తిడిని అధిగమించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అలీ బాబా: దస్తాన్-ఇ-కాబూల్ అనే షో సెట్‌లో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ షాక్‌కు గురిచేసింది. 
 
ఆమె ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు సెట్స్ నుంచి కొన్ని ఫోటోలను, వీడియోను షేర్ చేసుకుంది. అయితే తునిషా శర్మ వున్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటం వెనుక గల కారణం ఏంటనే దానిపై ప్రస్తుతం చర్చ మొదలైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే.. తునిషా సహనటులు ఆమె బలవన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
గతంలో తునిషాతో కలిసి పనిచేసిన పాండ్య స్టోర్ ఫేమ్ నటి సిమ్రాన్ బుదరూప్ తునిషా గురించి కామెంట్లు చేసింది. తునీషాకు ఆందోళన, నిరాశ సమస్యలు ఉన్నాయని తమతో వెల్లడించినట్లు చెప్పింది. తన కుటుంబ జీవితం అంతా సజావుగా లేదని తునీషా చెప్పినట్లు సిమ్రాన్ వెల్లడించింది. ఇకపోతే.. తునీషా మృతి పట్ల పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.