గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (18:40 IST)

ఆదివారం ప్రారంభం కానున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్

Mega Star Chiranjeevi,
మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి సోదరి మాధవి పది గంటలకు ప్రారంభిస్తారు.

ఈ క్యాంప్ కోసం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఎల్ బి నగర్ మెట్రో స్టేషన్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు సాయింత్రం ఎల్ బి నగర్ వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జేడీ లక్ష్మీనారాయణ సహా సినీ ప్రముఖులు, టీవీ కళాకారులు హాజరుకానున్నారని మెగా బ్లడ్ క్యాంప్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో రక్త దానం చేసిన వారికి  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం ఇస్తారు.