గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (20:17 IST)

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు

Rains
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కారణంగా.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం వుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావం కారణంగా రాబోయే మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం వుంది. 
 
కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుంది. అలాగే ఏపీ, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయుల్లో ఈశాన్య, తూర్పు దిశలో గాలులు వీస్తున్నాయి. 
 
దీంతో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా పశ్చిమ నైరుతి దిశగా గంటకు 13 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ తమిళనాడు నాగపట్టణం మీదుగా డిసెంబర్ 25న శ్రీలంక తీరానికి చేరుకుంటుంది.