గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (13:25 IST)

ఆయుర్వేద చిట్కాలు.. అరటి పువ్వు చూర్ణాన్ని ఆవు పాలతో..?

మధుమేహాన్ని నియంత్రించాలంటే.. రోజూ మెంతుల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. మధుమేహానికి మునగ, బచ్చలి, సీతాఫలాన్ని ఆహారంలో తీసుకోవాలి. మామిడికాయ టెంక గుజ్జును ఎండబెట్టి పొడి చేసి తేనె కలిపి తింటే కడుపులోని నులి పురుగులు తొలగిపోతాయి. మూలవ్యాధి కూడా నయమవుతుంది. అధిక రుతుస్రావం తగ్గిపోతుంది. 
 
కొత్తిమీర ఆకులను పంచదారతో గ్రైండ్ చేసి పాలు కలుపుకుని రోజూ 100 గ్రాములు తింటే మానసిక రుగ్మతలు దూరమవుతాయి. పసుపుతో పాటు అల్లం తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. అల్లం రసం, ఉల్లిపాయ రసం సమంగా కలిపి తీసుకుంటే వాంతులు ఆగుతాయి. అరటి పువ్వును చూర్ణం చేసి ఆ రసాన్ని ఆవు పాలలో కలిపి తాగితే కడుపునొప్పి తగ్గుతుంది.
 
జీలకర్రను నువ్వునూనెతో చూర్ణంలా చేసి తలకు రాసుకుని తలస్నానం చేస్తే తలనొప్పి, పిత్త వ్యాధులు తొలగిపోతాయి. పుదీనా ఆకుల రసాన్ని పచ్చ కర్పూరం కలిపి ముఖానికి రాసుకోవడం ద్వారా ముడతలు తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులపై రాస్తే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.