బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (20:28 IST)

అనిల్ రావిపూడి పర్యవేక్షణలో గాలిసంప‌త్`పూర్తి

Srivishnu, Rajendraprasad
బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం 'గాలి సంప‌త్`. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడంతో పాటు స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ కూడా చేస్తుండ‌డంతో సినిమాకి స్పెష‌ల్ క్రేజ్ వ‌చ్చింది. వ‌రుస‌గా ఐదు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మ‌రో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా `గాలి సంప‌త్` రూపొందుతోంది.

అనిల్ కో డైరెక్ట‌ర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ `గాలి సంప‌త్‌`గా టైటిల్ రోల్ పోషిస్తున్నఈ మూవీకి అనీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి11న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎస్ క్రిష్ణ మాట్లాడుతూ -  ``నా మిత్రుడు అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్యవేక్ష‌ణ‌లో రూపొందుతోన్న `గాలి సంప‌త్` మూవీ షూటింగ్ పూర్త‌య్యింది.  ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి మార్చి11న మ‌హాశివ‌రాత్రి కానుక‌గా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.
 
న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి, క‌థ‌: ఎస్‌. క్రిష్ణ‌, ర‌చ‌నా స‌హ‌కారం: ఆదినారాయ‌ణ‌, సినిమాటోగ్ర‌ఫి: సాయి శ్రీ రామ్‌, సంగీతం: అచ్చురాజ‌మ‌ణి, ఆర్ట్‌: ఎ ఎస్ ప్ర‌కాశ్‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నాగ‌మోహ‌న్ బాబు. ఎమ్‌, మాట‌లు: మిర్చి కిర‌ణ్‌, లిరిక్స్‌: రామ‌జోగ‌య్య శాస్త్రి.