శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (23:07 IST)

ఇతరుల బట్టలు విప్పడం ద్వారా డబ్బులు.. ఆ అర్హత రాజ్ కుంద్రాకు లేదు..?

Urfi Javed
ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాపై బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ మండిపడ్డారు. తన డ్రెస్ సెన్స్‌పై కుంద్రా చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. 
 
సెటైరికల్‌గా తన సోషల్ మీడియా ఖాతాలో రాజ్ కుంద్రా ఓ పోస్టు పెట్టారు. మీడియా ప్రస్తుతం రెండంటే రెండు విషయాలపైనే ఆసక్తి చూపుతుందని సెటైరికల్ కామెంట్స్ చేశారు. 
 
"ఒకటి నేను ఏం ధరిస్తున్నాను.. రెండు, ఉర్ఫీ ఏం ధరించడంలేదు" అంటూ మీడియాను ఎద్దేవా చేశారు. రాజ్ కుంద్రా పెట్టిన పోస్టుపై ఉర్ఫీ తీవ్రంగా స్పందించింది. 
 
ఇతరుల బట్టలు విప్పడం ద్వారా డబ్బులు సంపాదించే వ్యక్తికి తన దుస్తులపై వ్యాఖ్యానించే అర్హత ఉందా.. అనే అర్థంలో ఇన్ స్టా పోస్ట్ చేసింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.