ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మే 2023 (19:37 IST)

ఎరుపు చీరలో మెరిసిన ఉపాసన.. నమ్రత రియాక్షన్ ఏంటి?

Upasana
Upasana
టాలీవుడ్ స్టార్ హీరో, రామ్ చరణ్, ఉపాసన కామినేని తమ మొదటి బిడ్డ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉపాసన తన ప్రెగ్నెన్సీ జర్నీని తన అభిమానులతో పంచుకుంటుంది. 
 
ఇన్‌స్టాగ్రామ్, ఇంటర్వ్యూల ద్వారా అప్‌డేట్‌లను అందిస్తోంది. ఇటీవల, ఆమె తన మొదటి త్రైమాసికం నుండి త్రోబాక్ చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అద్భుతమైన చీరలో ఉపాసన మెరుస్తున్నట్లు ఉన్నాయి. 
 
సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరలో ఉన్న ఫోటోలను సైతం షేర్ చేసింది. తన ఫోన్లో ఉన్న ఇంత మంచి ఫోటోలను ఇంతకుముందు ఎందుకు పోస్ట్ చేయలేదా? ఆశ్చర్యంగా ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 
 
ఈ ఫోటోలకు మహేష్ బాబు సతీమణి నమ్రత స్పందిస్తూ.. తానూ అదే చెప్పాలనుకున్నానని వెల్లడించారు. హార్ట్ సింబల్‌ని షేర్ చేసింది ఉపాసన. ప్రస్తుతం వీరిద్దరూ చాట్‌కు సంబంధించి ట్విట్ కాస్త వైరల్‌గా మారుతోంది.