ఓవర్సీస్‌లో 700 స్క్రీన్లలో 'వకీల్ సాబ్' షో  
                                       
                  
				  				  
				   
                  				  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
				  											
																													
									  
	 
	రాజకీయాల కారణంగా సినిమాలకు రెండేళ్ళ గ్యాప్ ఇచ్చారు. ఇపుడు 'వకీల్ సాబ్' సినిమాతో మళ్లీ ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నారు. హిందీలో సూపర్ హిట్‌ను నమోదు చేసిన 'పింక్' సినిమాకి ఇది రీమేక్. 
				  
	 
	బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు - శిరీష్ కలిసి నిర్మించారు. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న కారణంగానే వేణు శ్రీరామ్‌కి పవన్ ఛాన్స్ ఇచ్చారు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఓవర్సీస్‌లో 700 స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో అత్యధిక స్క్రీన్‌లలో విడుదలయ్యే తెలుగు సినిమా ఇదేనని అంటున్నారు. 
				  																		
											
									  
	 
	అంజలి .. నివేదా థామస్ .. అనన్య ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, శ్రుతి హాసన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాతో పవన్ కొత్త రికార్డులకు తెరతీస్తూ వెళతాడేమో చూడాలి. 
				  																	
									  
	 
	కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేయగా అది రికార్డు స్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అలాగే, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి.