క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్
చిత్రపరిశ్రమలో హీరోయిన్లు వేధింపులకు గురికావడం కామన్. ముఖ్యంగా, క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగికంగా వేధింపులకు గురవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి వారిలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ఆమె సినిమాల్లో లేడీస్ విలన్‌గా బాగా పాపులర్ అవుతున్నాయి. సినిమాలో కీలక పాత్రలు కూడా చేస్తోంది. పెళ్లి అయిన తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది.
తాజాగా ఆ టీవీ షోకు జడ్జిగా వెళ్లింది. అక్కడ ఓ లేడీ కంటెస్టెంట్ తనకు జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. దీంతో వరలక్ష్మీ కూడా తాను ఫేస్ చేసిన వాటిని వ్యక్తం చేసింది. "నీది నాది సేమ్. నేను కూడా చిన్నవయసులో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. నన్ను కూడా ఐదారుగురు వేధించేవారు. కానీ నేను ఎపుడూ భయపడలేదు. ధైర్యంగా ముందుకు వెళ్లారు. మన హార్డ్ వర్క్ మనల్ని పైకి తీసుకొస్తుంది" అని చెప్పుకొచ్చింది. ఆమె చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. అంత పెద్ద హీరో కుమార్తెకు కూడా వేధింపులు తప్పలేదా అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.