వారంతా చప్రాసీ గాళ్ళేః బాబూమోహన్
సినిమా నటుడి నుంచి తెలుగుదేశం పార్టీలో వుండి ఎం.ఎల్.ఎ.గా చేసి, తదనంతం బి.జె.పి. పార్టీ తీర్థం తీసుకున్న బాబూమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపాదడపా సినిమాలు చేస్తూనే టీవీ షోలలో కూడా పాల్గొంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రాంతీయ పార్టీకి, జాతీయ పార్టీకి వ్యత్యాసాన్ని వెల్లడించారు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఒకప్పుడు ఎం.ఎల్.ఎ.గా మంత్రిగా చేశాను. పలానా మంత్రి అనేవారు. కానీ బి.జె.పి.లోకి వెళ్ళాక జాతీయ నాయకుడు అంటున్నారు. ఇంతకంటే గొప్ప పేరు ఎక్కడ వస్తుంది అంటున్నారు. నన్ను గుర్తించి అమిత్‌షా పార్టీలో తీసుకున్నారంటే అంతకన్నా ఏం కావాలి. అంతేకాకుండా ప్రాంతీయ పార్టీ అంటే ఊరు లాంటిది. జాతీయ పార్టీ పట్టణం లాండిదని ఉదహరించారు.
అసలు ప్రాంతాయ పార్టీల తీరును కూడా ఎండగట్టగారు. నాయకులకు మొత్తం పవర్ నాచేతులోనే వుండాలె. నేను చెప్పినట్లే వినాలె. నా కుటుంబానికి దక్కాలె. మిగిలిన వారంతా చప్రాసీలుగా వుండాలి. ఇలా అనుకునేవారు ప్రాంతీయ పార్టీ నాయకులు. అయ్యా, బాంచాన్ నీ కాలుమొక్కుతా.. అనేవాడికి మూలన వుండి చెప్పినట్లు చేయాలె. కానీ జాతీయపార్టీ అయితే ప్రతిదానికి పర్మిషన్ అడగాలి. ఇష్టమొచ్చినట్లు చేయకూడదు. కానీ తెలంగాణలో ఆయన ఇష్టం వచ్చినట్లు జరుగుతుంది. ఆయన ఎస్. అంటే ఎస్. నో అంటే నో.. ఆర్.టి.సి. కార్మికులను పిలిపించి భోజనం పెట్టాడు. వారికి జీతాలు పెంచాడు.. ఇప్పుడు ఇష్టంలేదు కాబట్టి. అక్కర్లేదు ఫో అంటున్నాడు. ఒకప్పుడు వారికి. ఎలక్షన్లు వద్దన్నాడు. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టాడు. ఇప్పుడు నేను ఇంకా ఆ పార్టీలోనే వుంటే ప్రగతిభవన్ మెట్ల దగ్గరే వుండేవాడిని. దేవుడు నాకు మంచి చేశాడు. జాతీయ పార్టీలో జేరాక మంచి గుర్తింపు వచ్చింది.
ఇక సినిమాల గురించి చెబుతూ. ఇప్పుడు కొందరు అడుగుతున్నారు. ఒకప్పుడు నేను మంత్రిగా వున్నా కాబట్టి కమర్షియల్ ప్రోగ్రామ్‌లో ఇన్‌వాల్వ్ కాకూడదు. అందుకే సినిమాలు చేయకూడదని చంద్రబాబు గారు అన్నారు. ఎన్.టి.ఆర్. సి.ఎం.గా వుండగా చేయలేదు. మేజర్‌చంద్రకాంత్, విశ్వామిత్ర పవర్‌లో లేనప్పుడు చేశారు. ఇప్పుడు కొందరు నన్ను అడుగుతున్నారు. త్వరలో వివరాలు చెబుతాను అంటున్నారు బాబూమోహన్.