గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (14:48 IST)

అతిథి వెబ్ సిరీస్ ని నమ్ముకున్న వేణు తొట్టెంపూడి

Athidhi web series
Athidhi web series
చిరునవ్వుతో, స్వయం వరం వంటి సినిమాల హీరో తాజాగా రవితేజ నటించిన రామారావు ఆన్‌ డ్యూటీ చిత్రం లో నటించారు. ఇపుడు వెబ్ సిరీస్ చేశారు. వేణు తొట్టెంపూడి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ “అతిథి”. ప్రముఖ ఓటీటీ కంపెనీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇటీవల డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ నుంచి వచ్చిన సేవ్ ది టైగర్స్, సైతాన్, దయ వంటి సిరీస్ లు సూపర్ హిట్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో “అతిథి”పై ప్రేక్షకుల్లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు.
 
ఇవాళ  “అతిథి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. సెప్టెంబర్ 19 నుంచి “అతిథి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన “అతిథి” వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా..తాజాగా  డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో భారీ వర్షంలో తడిసిపోయి ఓ అర్థరాత్రి ఇంటికి వచ్చిన మహిళకు ఆతిథ్యం ఇస్తాడు హీరో. ఆ తర్వాత వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇంతలో ఆమె భయంకరంగా బిహేవ్ చేయడంతో టీజర్ ఆసక్తికరంగా ముగుస్తుంది. టీజర్ “అతిథి”  వెబ్ సిరీస్ పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.