బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 5 జులై 2017 (14:20 IST)

సచిన్ టెండూల్కర్ పక్కింటిలో పూనమ్ పాండే.. ఇక గోల గోలే...

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పక్కింటికి వెళ్ళిపోయింది.. సెక్సీ బ్యూటీ పూనమ్ పాండే. ముంబైలోని బాంద్రాలో ఉన్న సచిన్‌కు పక్కిళ్లే అద్దెకు దొరకడంతో పూనమ్ ఎగిరి గంతేసిందట. దీంతో పూనమ్ ఆనందానికి అవధుల

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పక్కింటికి వెళ్ళిపోయింది.. సెక్సీ బ్యూటీ పూనమ్ పాండే. ముంబైలోని బాంద్రాలో ఉన్న సచిన్‌కు పక్కిళ్లే అద్దెకు దొరకడంతో పూనమ్ ఎగిరి గంతేసిందట. దీంతో పూనమ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో వెంటనే తెగ ఎగ్జైట్ అవుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పూనమ్ పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
టీమిండియా ప్రపంచకప్ గెలిస్తే న్యూడ్ షో చేస్తానని ప్రకటించి ఒక్కసారిగా పాపులర్ అయిన సెక్సీ బ్యూటీ పూనమ్ పాండే.. సినిమాల్లో నటించింది తక్కువే అయినప్పటికీ.. సెన్సేషనల్ ఫోటో షూట్లతో మంచి పబ్లిసిటీ సంపాదించుకుంది. తాజాగా యోగా డేను పురస్కరించుకుని పెద్ద హడావుడే చేసింది. తాజాగా సచిన్ పక్కిళ్లు అద్దెకు దొరకడంతో పబ్లిసిటీ మంచి మ్యాటర్ దొరికిందని పూనమ్ తెగ హ్యాపీగా ఉంది.