శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (15:30 IST)

షాదీ ముబారక్‌ టీజర్: ఇంటిపేరు కూడా అందంగా (video)

Shaadi Mubarak
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ నుంచి తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది.. 'షాదీ ముబారక్‌'. వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. 'షాదీ ముబారక్‌' మార్చి 5న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.
 
సాధారణంగా పెళ్లి చేసుకునే అమ్మాయి, అబ్బాయి తమకు ఒకరికొకరు ఎలా నచ్చాం, ఎందుకు నచ్చాం అనే విషయాలను పలు అంశాల ఆధారంగా నిర్దారించుకుంటారు. కానీ 'షాదీ ముబారక్‌' చిత్రంలో హీరోయిన్ తను పెళ్లి చేసుకునే యువకుడే కాదు.. తన ఇంటిపేరు కూడా అందంగా ఉండాలనుకునే రకం. 
 
కొన్ని పరిస్థితుల్లో అలాంటి అమ్మాయికి డిఫరెంట్ ఇంటి పేరుండే హీరో పరిచయమైతే ఎలా ఉంటుంది. అనే పాయింట్ మీద 'షాదీ ముబారక్‌' సినిమా రూపొందినట్లు టీజర్ చూస్తుంటే అవగతమవుతుంది. టీజర్ చాలా ఎంటర్‌టైనింగ్ ఉండటంతో సినిమా కూడా ఇదే రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ టీజర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.