శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (13:09 IST)

దగ్గు, కఫంతో బాధపడేవారు.. కరివేపాకు, తేనెను..? (video)

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచాలంటే.. డైట్‌లో కరివేపాకును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకులోని క్యాంఫెరాల్ అనే యాంటీ యాక్సిడెండ్లు ఆక్సీకరణ ఒత్తిడిని హానికర రసాయనాలను తొలగిస్తుంది. టీస్పూన్ నెయ్యిలో అరకప్పు కరివేపాకు రసం, కాస్త పంచదార, మిరియా పొడి వేసి సిమ్‌లో మరిగించి తీసుకుంటే కాలేయ సమస్యలు తగ్గుతాయి. 
 
అలాగే కరివేపాకులోని పీచు కారణంగా రక్తంలో చక్కెర నిల్వలు కూడా తగ్గుతాయి. ఇది కొవ్వును కూడా కరిగిస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. పరగడుపున కొద్దిగా పచ్చి కరివేపాకును తినడం వల్ల మంచి ఫలితం వుంటుంది. కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. అజీర్ణ రుగ్మతలను తొలగించుకోవాలంటే.. చిన్న రేగుపండు సైజులో కరివేపాకుని ముద్దలా చేసి మజ్జిగలో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 
 
దగ్గు, కఫంతో బాధపడుతుంటే టీస్పూన్ కరివేపాకు పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. కరివేపాకులోని హానికర సూక్ష్మజీవులను నివారించే గుణం వల్ల మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. కరివేపాకును నూరి తలకు పెట్టుకుంటే చుండ్రు తగ్గుతుంది. రక్తహీనతకు కరివేపాకు చెక్ పెడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.