సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (12:07 IST)

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

samanta dance
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ - సమంత జంటగా నటించిన వెబ్ సిరీస్ "సిటాడెల్ - హన్నీబన్నీ". ఈ వెబ్ సిరీస్ గత కొన్ని రోజులుగా స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి సూపర్ హిట్ టాక్ రావడంతో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతూ అత్యధిక వ్యూస్ రాబడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం పార్టీ ఇచ్చింది. ఇందులో సమంత, వరుణ్ ధావన్‌లు డ్యాన్స్ చేసి అందర్నీ ఆలరించారు. 
 
ఈ పార్టీ ఫోటోలను సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. అందమైన వ్యక్తులతో గడిపిన అందమైన సాయంత్రం. నా మనసంతా ఆనందం. కృతజ్ఞతతో నిండిపోయింది అని ఆ ఫోటోలకు క్యాప్షన్ జోడించింది. సమంత పోస్టుకు వరుణ్ ధావన్ స్పందిస్తూ, ఎప్పటికీ ది బెస్ట్ కో స్టార్ అంటూ రిప్లై ఇచ్చారు. కాగా, వరుణ్ ధావన్ నటించి త్వరలో విడుదలకానున్న నైన్ మటక్కా అనే పాటకు వీరిద్దరూ డ్యాన్స్ చేశారు.