శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 30 మార్చి 2019 (10:27 IST)

హిజ్రాగా విజయ్ సేతుపతి.. వందకు వంద మార్కులు..

తమిళ నటుడు విజయ్ సేతుపతి. వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. పైగా, విభిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు... వైవిధ్యమైన పాత్రలు చేయాలన్న తపన ఉన్న నటుడు. అందుకే మంచి క్రేజ్‌తో పాటు.. ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. 
 
ఈ క్రమంలో విజయ్ సేతుపతి, సమంత, మరికొంతమంది తారాగణం నటించిన చిత్రం సూపర్ డీలక్స్. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఇందులో విజయ్ సేతుపతి హిజ్రా పాత్రను ధరించాడు. నిజానికి ఇలాంటి పాత్రలు
చేసేందుకు ఏ ఒక్క హీరో ముందుకురారు.
 
ఈ సినిమా చూసినవాళ్లంతా.. హిజ్రా పాత్రలో విజయ్ సేతుపతి అదరగొట్టేశాడని అంటున్నారు. సినీ విశ్లేషకులు సైతనం సేతుపతి నటనకి నూటికి నూరు మార్కులు ఇచ్చేస్తున్నారు. అతని కెరియర్లో ఈ హిజ్రా పాత్ర చెప్పుకోదగినదిగా నిలిచిపోవడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.