ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 23 మార్చి 2024 (19:38 IST)

విన‌డానికి ఆనందంగా అనిపించింది : విజ‌యేంద్ర‌ప్ర‌సాద్

Vijayendra Prasad - Guduru Narayana Reddy
Vijayendra Prasad - Guduru Narayana Reddy
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై  యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. మార్చి 15న ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లోనూ  విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ హిస్టారిక‌ల్ హిట్‌ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. హిస్టారిక‌ల్ హిట్ విజ‌యోత్స‌వాల్లో భాగంగా చిత్ర యూనిట్ అంతా కేక్ క‌ట్ చేశారు.
 
ముఖ్య అతిథి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ `వృత్తిరీత్యా నేను 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కు చెన్నైలో ఉన్నా. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌కి మారాను. అనుకోకుండా నాకు ట్రైన్‌లో సుద్దాల అశోక్‌తేజ క‌లిశారు. ఆ జ‌ర్నీలో ఆయ‌న ర‌జాకార్ల వ‌ల్ల ప‌డ్డ తిప్ప‌ల గురించి చెప్పారు. వాళ్ల నాన్న‌గారు కూడా ర‌జాకార్ల మీద పోరాటం చేశార‌ని చెప్పారు. దేశ‌భ‌క్తులంద‌రూ మీటింగ్ పెట్టుకుంటే ర‌జాకార్లు దాడికి వ‌చ్చార‌ట‌. అప్పుడు ఎవ‌రో ఒకావిడ `ఎవ‌ర్రా.. వేయండెహే.. వేయండెహే.. అని అన్నారట‌. అప్పుడు సుద్దాల హ‌నుమంతుగారు వెయ్ వెయ్ దెబ్బ‌కు దెబ్బ‌.. `అని పాట పాడార‌ట‌. అదంతా వింటుంటే థ్రిల్లింగ్‌గా అనిపించింది. 
 
వ‌చ్చిన కొత్త‌ల్లో తెలంగాణ‌లోని మారుమూల ప్రాంతాల‌కు వెళ్లేవాడిని. వాళ్ల అనుభ‌వాల‌ను వినేవాడిని. నిజామాబాద్‌లో ఖిల్లాకి వెళ్లాను. అక్క‌డ దాశ‌ర‌థిగారు రాసిన నా తెలంగాణ కోటి ర‌త‌నాల వీణ  రాశార‌ని గుర్తుకొచ్చింది. వాట‌న్నిటి ఇన్‌స్పిరేష‌న్‌తో నేను రాజ‌న్న సినిమా చేశాను. దాంట్లో ర‌జాకార్ల తాలూకు విష‌యాన్ని ట‌చ్ చేశాను. దాన్ని పూర్తిగా ఎవ‌రైనా సినిమా చేస్తే బావుంటుంద‌ని అనుకున్నాను. దాన్ని గూడూరు నారాయ‌ణ‌రెడ్డిగారు చేశారు. రివ్యూలు బావున్నాయి. డైర‌క్ట‌ర్‌గారి ప‌నిత‌నం బావుంద‌ని మెచ్చుకున్నారు చాలా మంది. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు బాగా చేశార‌ని అన్నారు. విన‌డానికి ఆనందంగా అనిపించింది` అని అన్నారు.

 గూడూరు నారాయ‌ణ‌రెడ్డి మాట్లాడుతూ `భావిత‌రాల భ‌విష్య‌త్తు కోసం తీసిన సినిమా ఇది. డ‌బ్బు కోసం, గ్లామ‌ర్ కోసం తీయ‌లేదు. న‌న్ను ఆదేశించింది తిరుమ‌ల తిరుప‌తి దేవుడు శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామివారు. వారి స‌న్నిధికి వెళ్లిన‌ప్పుడు నాకు ర‌జాకార్ అనే పేరు త‌ట్టింది. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ మెచ్చుకున్నారు. హై క్వాలిటీతో తీశామ‌ని అన్నారు.