సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2024 (16:26 IST)

విక్రమ్ సహిదేవ్ లగడపాటి, ఎస్తేర్ అనిల్ జంటగా త్రినాథరావు నక్కిన నిర్మాతగా చిత్రం

Vikram Sahidev Lagadapati - Esther Anil - Sandeep Kishan
Vikram Sahidev Lagadapati - Esther Anil - Sandeep Kishan
డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన నిర్మాతగా నక్కిన నేరేటివ్స్‌లో ప్రొడక్షన్ నెం 2 చిత్రం నేడు పూజ తో హైదరాబాద్ లో ప్రారంభమయింది. లగడపాటి శ్రీధర్ కొడుకు విక్రమ్ సహిదేవ్, దృశ్యం లో నటించిన ఎస్తేర్ అనిల్ టీనేజ్ జంటగా నటిస్తున్నారు. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్.వి.ఎస్.ఎస్. సురేష్ సహ నిర్మాత. త్రినాథరావు,నాయుడు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్తం షాట్ కు సందీప్ కిషన్ క్లాప్‌ కొట్టగా, శరత్ మరార్ కెమెరా స్విచాన్ చేశారు. సుమంత్ తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు.
 
అనకాపల్లి బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాలో  తారక్ పొన్నప్ప కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈగిల్ ఫేమ్ దావ్‌జాంద్ సంగీతం అందిస్తుండగా, మాయ వి. సినిమాటోగ్రఫర్. ప్రవీణ్ పూడి ఎడిటర్, రఘు కులకర్ణి ప్రొడక్షన్ డిజైనర్. నరేష్ తుల, రాజేంద్ర ప్రసాద్ డైలాగ్స్ రాయగా, త్రినాధ రావు నక్కిన, నరేష్ తుల, ఉదయ్ భాగవతుల స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
 
నిర్మాత త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ..  దీనికి టైటిల్ ఖరారు చేశాం. త్వరలోనే ప్రకటిస్తాం. నేను చాలా స్ట్రగుల్ అయి ఈ స్థాయికి వచ్చాను. నాలాగే ఎంతోమంది స్ట్రగుల్ అవుతుంటారు. వాలందరికీ నా శక్తికి తగ్గ ఫ్లాట్ ఫాం ఏర్పాటు చేయాలని అనుకున్నాను. దీనికి నా స్నేహితులు, మిత్రులు సపోర్ట్ తో నక్కిన నేరేటివ్స్‌ నిర్మాణ సంస్థని స్థాపించాను. 
 
సినిమా చూపిస్తా మామ వరకూ నేనే కథలు రాసేవాడిని. తర్వాత రాయలేదు. నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే, ధమాకా మా ప్రసన్న రాశారు. ఐతే ఈ సినిమా కోసం మళ్ళీ కథ రాశాను. ఇది కల్ట్ లవ్ స్టొరీ. టౌన్ లో జరిగే అందమైన ప్రేమకథ. ఇందులో విలన్ పాత్ర కూడా చాలా కీలకమైనది.  కథ అద్భుతంగా వచ్చింది. నాతో పాటు నరేష్ , ఉదయ్ భాగవతుల స్క్రీన్ ప్లేలో, నరేష్ , రాజేంద్ర ప్రసాద్ డైలాగ్స్ లో పని చేశారు. దర్శకుడు వంశీ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇందులో విక్రమ్ పాత్ర అదిరిపోతుంది. విక్రమ్ కి జోడిగా ఎస్తర్ చేస్తున్నారు. తనలో చాలా ప్రతిభ వుంది. పొన్నప్ప మరో కీలకమైన పాత్రలో కనిపిస్తారు. దేవ్ జాంద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ గా వుంటుంది. ప్రముఖ సాంకేతిక నిపుణులతో సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నాం. దర్శకుడిగా ప్రేక్షకులు నన్ను గొప్పగా ఆదరించారు. నిర్మాతగా ఇప్పుడే అడుగులు వేస్తున్నాను. దీనికి కూడా పెద్దపీట వెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఇందులో పని చేస్తున్న అందరికీ మంచి పేరు రావాలి'' అని కోరారు.
 
దర్శకుడు వంశీ కృష్ణ మల్ల మాట్లాడుతూ,  రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుంచి మొదలుపెడుతున్నాం. అనకాపల్లి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తాం. విక్రమ్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు.  ఈ సినిమా తర్వాత పెద్ద కమర్షియల్ హీరో అవుతాడు. ఎస్తేర్ పాత్ర కూడా చాలా అద్భుతంగా వుంటుంది. తారక్ పొన్నప్ప పాత్ర కూడా కీలకంగా వుంటుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది. ఎవరూ వూహించలేని జోనర్ ఇది. దావ్‌జాంద్ నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చారు'' అన్నారు.
 
సంగీత దర్శకుడు దావ్‌జాంద్ మాట్లాడుతూ... త్రినాథ్ గారితో ఇది రెండో ప్రాజెక్ట్. కథ చాలా బావుంది. ఐదు అద్భుతమైన పాటలు కుదిరాయి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు.