సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 మార్చి 2017 (10:35 IST)

ఇళయరాజాకు సన్మానం.. సంగీత విభావరిలో ఎస్పీ.. ఇద్దరినీ కలిపితీరుతా: విశాల్

అంతర్జాతీయ వేదికల మీద తన పాటలు పడేందుకు తప్పనిసరిగా తన అనుమతి ఉండాల్సిందేనని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు.. మరో సంగీత దర్శకుడు, గాయకుడు ఇళయరాజా నోటీసులు పంపడం.. ప్రస్తుతం మ్యూజిక్ ఇండస్ట్రీలో

అంతర్జాతీయ వేదికల మీద తన పాటలు పడేందుకు తప్పనిసరిగా తన అనుమతి ఉండాల్సిందేనని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు.. మరో సంగీత దర్శకుడు, గాయకుడు ఇళయరాజా నోటీసులు పంపడం.. ప్రస్తుతం మ్యూజిక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు విశాల్‌ ప్రకటించారు. 
 
తమిళ సినీరంగం తరఫున ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సన్మానసభను నిర్వహించేందుకు సన్నాహాలు చేపడుతున్నట్టు విశాల్ చెప్పారు. సన్మానసభ సందర్భంగా ఇళయరాజా నిర్వహించే సంగీత విభావరి కార్యక్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొంటారని ప్రకటించారు.
 
ఎస్పీ-రాజాల మధ్య మనస్పర్థలు తీవ్రమైన తరుణంలో విశాల్‌ ఆ ఇరువురు ఒకేవేదికపై సంగీత విభావరిలో పాల్గొంటారని ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే ఇద్దరితో మాట్లాడినట్లు విశాల్ తెలిపారు. నిర్మాతల సంఘం ఎన్నికలు ముగిసిన తర్వాత ఇళయరాజాకు సన్మానసభ జరుపుతామని విశాల్‌ తెలిపారు.