ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (18:26 IST)

చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై విశాల్ రియాక్షన్

Visal-SJsurya-sunil
Visal-SJsurya-sunil
యాక్షన్ హీరో విశాల్, ఎస్ జే సూర్య, రీతూ వర్మ కాంబోలో వచ్చిన ‘మార్క్ ఆంథోని’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 15న రిలీజ్ అయిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. మంచి వసూళ్లతో మూవీ ప్రదర్శింపబడుతుండటంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. 
 
ఈ ఈవెంట్‌లో చంద్రబాబు నాయుడును అరెస్ట్‌ను రజనీకాంత్, తమిళ సినీ పెద్దలు వ్యతిరేకిస్తున్నారని మీరు జగన్ అభిమాని కదా మీ అభిప్రాయం ఏంటని విశాల్‌ను ఒక జర్నలిస్ట్ అడిగారు. దీనికి విశాల్ స్పందిస్తూ.. తాను జగన్‌ను ఎంతగానో అభిమానించినా ఈ అరెస్ట్ విషయంలో ప్రభుత్వం ఒకసారి లోతుగా ఆలోచించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. 
 
నేను ఇక్కడ ఓటు వేయలేదు, తమిళనాడులోనే ఓటు వేశాను.. ఒక వ్యక్తిగా నేను చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనే ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికే ఈ పరిస్థితి అంటే.. నాలాంటి సామాన్యుడికి భయమేస్తుంది. అదే నేను ఓపెన్‌గా చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్న ప్రశ్నలకు ఈరోజు సమాధానాలు లేవు. నిజానికి ఈ సబ్జెక్ట్ గురించి నాకు లోతుగా తెలీదు  అని విశాల్ అన్నారు. 
 
సినిమా గురించి విశాల్ మాట్లాడుతూ.. ‘మార్క్ ఆంథోని చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. రివ్యూలు బాగుండి, కలెక్షన్లు కూడా బాగా వచ్చే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. వాటిలో మార్క్ ఆంథోని ఉండటం ఆనందంగా ఉంది. కరోనా తరువాత ఆడియెన్స్ ఏ సినిమాకు వెళ్లాలన్నా చాలా ఆలోచిస్తున్నారు. థియేటర్లకు జనాలను రప్పించడమే పెద్ద సవాలుగా మారింది. రెండున్నర గంటల సినిమాను రెండున్నర నిమిషాల ట్రైలర్‌లో చూపించి, ఆకట్టుకుని రప్పించాలి. అలా మా ట్రైలర్ అందరికీ నచ్చింది. ఇప్పుడు సినిమాను చూస్తున్నారు. వారు పెట్టిన టికెట్ డబ్బులకు సరిపడా వినోదం ఇచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో ఎస్ జే సూర్య గారు అద్భుతంగా నటించారు. ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. సినిమాలోని ప్రతీ సీన్‌కు అందరూ పగలబడి నవ్వుతున్నారని తెలిసి ఆనందంగా ఉంది. సునిల్ గారి కామెడీ ఓ మెడిసిన్ లాంటిది. అధిక్ నాకు ఈ కథ నెరేట్ చేసినప్పుడే సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం. అధిక్‌తో సినిమా చేస్తున్నానని తెలియడంతో ఇండస్ట్రీలో కొంత మంది వద్దని వారించారు. కానీ అధిక్ నెరేషన్ నాకు నచ్చింది. సినిమా బాగా తీస్తాడని నాకు నమ్మకం ఉండేది. చెప్పింది చెప్పినట్టుగా తీశాడు. ఈ సినిమాను జనాలు థియేటర్లోనే చూస్తున్నారు. నాకు సంతోషంగా అనిపిస్తోంది. తెగిన ప్రతీ టికెట్ నుంచి ఒక రూపాయి రైతులకు ఇస్తాను. మా సినిమాను ఇంకా చూడని వాళ్లుంటే థియేటర్లో చూడండి.
 
 ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘మార్క్ ఆంథోని సౌత్ ఇండియాలో దుమ్ములేపేస్తోంది. అదిరింది. నా డబ్బింగ్ చాలా బాగుందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. సినిమా చూడండి. బాగుంటే.. మీ ఫ్రెండ్స్‌కు చెప్పండి. అన్ని చోట్లా ఈ సినిమా బాగా ఆడేస్తోంది. ఈ రెండో వారంలోనూ బాగా ఆడాలి. మూవీ చూసిన వాళ్లు చూడని వాళ్లకు చెప్పండి. కొత్త కాన్సెప్ట్‌తో సినిమాను తీశాం. పగలబడి నవ్వుతున్నామని అందరూ అంటుంటే సంతోషం వేస్తోంది. ఈ సినిమాకు ఎడిటింగ్ బాగుంది. ఏ మాత్రం గందరగోళం లేకుండా ఎడిట్ చేసి ఇచ్చారు. అంత గొప్ప స్క్రీన్ ప్లే ఇచ్చిన అధిక్‌కు హ్యాట్సాఫ్. విశాల్ గారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. ఆయన ఓ మాస్ హీరో అయినా కూడా కథకు తగ్గట్టు నా పాత్రకు కూడా సమానమైన స్పేస్ ఇచ్చారు. ఆయన సేవా కార్యక్రమాలు, ఆయన మంచితనం అందరికీ తెలిసిందే. ఆన్ స్క్రీన్‌లోనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ హీరోనే. ఆయనది చాలా మంచి మనసు. ఆయనకు మార్క్ ఆంటోని కెరీర్ బెస్ట్ సినిమా అయింది. అధిక్ ఎలా నెరేట్ చేశాడో అలానే తీశారు. సునిల్ గారు ఇప్పుడు తెలుగు వారు కాదు. తమిళ్‌లో చేసిన ప్రతీ సినిమా హిట్ అవుతోంది. సినిమాను మళ్లీ మళ్లీ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
 
 సునిల్ మాట్లాడుతూ.. ‘నా జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా మార్క్ ఆంథోని. పేరుకు తగ్గట్టు నిజంగానే విశాలమైన మనిషి విశాల్. తన కారెక్టర్ కంటే వేరేతర పాత్ర బాగున్నా కూడా ఒప్పుకుంటారు. నిజంగానే విశాలమైన మనసున్న మనిషి. విశాల్ లాంటి మంచి మనుషులు ఉండాలి. డైరెక్టర్ అధిక్ అయితే చిన్న పిల్లాడిలా సెట్‌లో సందడి చేసేవాడు. నాకు ప్రతీ డైలాగ్ ప్రాంప్ట్ ఇచ్చి నాతో చేయించుకున్నాడు. బిజినెస్‌లో షేర్ అడిగేవాళ్లుంటారు కానీ మంచి పనుల్లో షేర్ అడగరు. కానీ ఎస్ జే సూర్య గారు మంచి పనుల్లో షేర్ అడుగుతుంటారు. నాకు తమిళ భాష రాదు. తమిళ్ నేర్చుకోవడం కొత్త అనుభూతినిచ్చింది. ఈ సినిమాకు ఎన్ని సీక్వెల్స్ అయినా తీసే సత్తా ఉంది. ఇంకా ఈ సినిమాను చూడని వాళ్లంతా థియేటర్ల‌కు వచ్చి చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
 
 అధిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. ‘తొమ్మిదేళ్లుగా విశాల్ అన్నతో నా ప్రయాణం. మార్క్ ఆంథోని అనేది నాకు రచయితగా, దర్శకుడిగా పునర్జన్మను ఇచ్చింది. విశాల్ లాంటి హీరో నన్ను నమ్మడం అనేది ఆశామాషీ వ్యవహారం కాదు. నన్ను నమ్మిన విశాల్ అన్నకి థాంక్స్. అడిగిందల్లా ఇచ్చిన నిర్మాత వినోద్ గారికి థాంక్స్. ఎస్ జే సూర్య, సునిల్ పాత్రలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే సంతోషంగా ఉంది. మా చిత్రం ఆడియెన్స్‌కు నచ్చడం ఆనందంగా ఉంది. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేశారు. మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.