శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 4 జూన్ 2019 (15:51 IST)

విశాల్ అలాంటి వాడు కాదు...

రైతుల సమస్యలను గురించి, వ్యవసాయానికి గల ప్రాధాన్యతను గురించి చాలామంది హీరోలు సినిమాల్లోనూ, బయటా బాగానే మాట్లాడుతుంటారు. అయితే వాళ్లు సదరు రైతుల కోసం, రైతుల బ్రతుకుల కోసం ఏం చేసారో, ఏం చేయనున్నారో మాత్రం ఎవరికీ తెలియదు. అయితే హీరో విశాల్‌ మాత్రం అందరిలా అలా మాటలు చెప్పి వదిలేయకుండా వాళ్లకు ఏదో చేయాలనే తన ఆలోచనతో తాను అందరిలా మాటలు చెప్పేవాడిని కానని మరోసారి నిరూపించుకున్నాడు. 
 
వివరాలలోకి వెళ్తే... ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ టాక్‌తో నడుస్తున్న విశాల్ సినిమా "అయోగ్య" కోసం అమ్ముడైన టికెట్లలో ఒక్కో రూపాయి చొప్పున రైతు సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వాలని విశాల్ నిర్ణయించుకున్నాడట. ఈ సినిమాకే కాకుండా, ఇక ముందు ముందు రాబోయే తన ప్రతి సినిమాకూ ఆయన ఇదే పద్ధతిని పాటించాలనుకుంటున్నాడట. ఇప్పటికే ఆయన గతంలో నటించిన ‘అభిమన్యుడు’ సినిమాకి కూడా ఈ పద్ధతిని పాటించిన విషయం అందరికీ తెలిసిందే.