గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

చిరంజీవి "విశ్వంభర" టీజర్ ఎలా ఉంది? (Teaser)

vishwambhara teaser
మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు వశిష్ట కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం "విశ్వంభర". ఈ చిత్రం టీజర్‌ను విజయదశమి వేడుకలను పురస్కరించుకుని మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. శుక్రవారం చెప్పినట్టుగానే దసరా కానుకంగా ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ విడుదల చేసింది. 
 
సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ చిత్రంలో చిరు తన నటనతో మెస్మరైజ్ చేశారు. టీజర్‌లో గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెగాస్టార్ మాస్ అవతార్, పవర్‌పుల్ డైలాగులు, గ్రాండ్ విజువల్స్‌తో ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. 
 
ఇక ఈ మూవీలో చిరంజీవి సరసన త్రిష్ హీరోయిన్‌గా నటించగా, యూవీ క్రియేషన్స్ బ్యానరుపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్నారు.