మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (15:54 IST)

మేము ఓ మూవీని 24 గంటల్లో పూర్తి చేశాం- అభి త‌ప‌న నాకు న‌చ్చింది- రోజా

Roja-Abhi-Sai rajesh andh others
పది గంటల్లో మూవీ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే మేము తమిళ్ లో "స్వయంవరం" మూవీ ని 24 గంటల్లో పూర్తి చేశాము. ఒక సాంగ్ చేయడానికే 3 నుండి 5 రోజులు ప‌ట్టే పాటను ప్రభుదేవా మాస్టర్ తో మేము మూడు గంటల్లో చేసి సినిమాను 24 గంటల్లో చేయాలని పరుగులు పెట్టి సినిమాను పూర్తి చేశాము అలాంటిది `వైట్ పేప‌ర్‌` సినిమాను పది గంటల్లో పూర్తి చేయడం అంటే మాటలు కాదు ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు- అని సీనియ‌ర్ న‌టి రోజా వ్యాఖ్యానించారు.

 
జి ఎస్ కె ప్రొడక్షన్స్ పతాకంపై అదిరే అభి (అభినయ కృష్ణ) వాణి, తల్లాడ సాయి కృష్ణ, నేహా, నందకిషోర్ నటీనటులుగా  శివ దర్శకత్వంలో గ్రంధి శివ ప్రసాద్ నిర్మించిన చిత్రం "వైట్ పేపర్". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ  చిత్ర టీజర్ను ప్రసాద్ ల్యాబ్‌లో రోజా ఆవిష్క‌రించారు.
 
ఇంకా రోజా మాట్లాడుతూ, అభి చాలా డిసిప్లేన్ మల్టీ టాలెంటెడ్ తను ఎప్పుడూ ఏదో చేయాలనే తపన పడుతుంటాడు. అందుకే తను పడే తపన నాకు చాలా నచ్చింది. "పాయింట్ బ్లాంక్" మూవీతో వచ్చి ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ వైట్ పేపర్ సినిమా గొప్ప విజయం సాధించి దర్శకనిర్మాతలకు గొప్ప పేరు తీసుకు వచ్చి వీరికి మరిన్ని అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. జబర్దస్త్ కుటుంబ సభ్యుడైన అభిని ఒక యాంకర్ గా చూశాము. దర్శకుడిగా చూశాం ఇప్పుడు హీరోగా చూస్తున్నాం తను ఈ సినిమాకు తనకు గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
దర్శక, నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ.. నా ఫస్ట్ సినిమా ను వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను రెండో సినిమా నాలుగు సంవత్సరాలు చేశాను. మూడవ సినిమాను ఫాస్ట్ గా చేయాలను కున్నా కూడా 9 నెలలు పట్టింది.అలాంటిది ఈ సినిమాను 10 గంటల్లో పూర్తి చేసి రికార్డు కొట్టడం చాలా గ్రేట్. ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దామని చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నాను. ఇలాంటి చాలెంజింగ్  సినిమాలను తీయాలంటే గట్స్ ఉండాలి. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రొడ్యూసర్లు మా పైన ప్రెజర్ పెడతారు. వీరి ప్రయత్నాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించి  ఈ సినిమాను పెద్ద హిట్ అవ్వాలి అని అన్నారు.