ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (15:46 IST)

జబర్దస్త్ షోకు బైబై చెప్పనున్న వైకాపా ఎమ్మెల్యే రోజా?

తెలుగు బుల్లితెర రంగంలో జబర్దస్త్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో వస్తుందంటే చాలు ఎంత బిజీగా ఉన్నా కూడా బుల్లితెర ముందు వాలిపోతారు. ఈ షో స్టార్ట్ అయ్యాక ఎంత తోపు ప్రోగ్రాములు.. ఎన్ని ఛానెల్స్‌లో వచ్చినా కూడా ఈ షో టీఆర్పీ దరిదాపులకు కూడా రాలేదు. దీనిని బట్టి జబర్దస్త్ షోకు ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది. అయితే ఈ షోకు జడ్జ్‌గా ఉండే ఫైర్‌బ్రాండ్ రోజా మధ్యలో గ్యాప్ తీసుకుంటున్నారు. ఆమె ప్లేస్‌లో వేరే జడ్జ్‌లు వస్తున్నారు. 
 
తాజాగా ఈ షో నుంచి మరోసారి రోజా పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ వారం జడ్జ్‌గా మనోతో పాటు ఇంద్రజ వచ్చారు. ఇటీవల ఆమె తరచూ గ్యాప్ తీసుకుంటున్నారు. మరోవైపు ఏపీలో ఆమె అధికార వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ రాజకీయాల్లో బిజీ బిజీ.. ఇటు బుల్లితెర మీద కూడా బిజీగా ఉండడంతో ఆమె కొన్ని సార్లు ఈ షోకు బ్రేక్ ఇవ్వక తప్పడం లేదు.
 
ఇక సింగర్ మనో ఎలాగూ జడ్జ్‌గా కంటిన్యూ అవుతున్నాడు. అందుకే రోజా మిస్ అయిన ప్రతిసారి ఎవరో ఒకరిని కొత్త జడ్జ్‌గా తీసుకు రావాల్సి వస్తోంది. ఇక ఇప్పుడు రోజా తరచూ జబర్దస్త్ షోకు గ్యాప్ ఇస్తూ ఉండడంతో మల్లెమాట టీం ఇంద్రజను పర్మినెంట్ మెంబర్‌గా తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఇక వచ్చే ఎన్నికల నేపథ్యంలో రోజా మరింత బిజీగా ఉండే ఛాన్సులు ఉన్నాయి. ఇక అప్పుడు ఇంద్రజ ఇక్కడ పర్మినెంట్ అయిపోయేలా ఉంది.