ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 14 జనవరి 2022 (07:20 IST)

నాన్న ఆశీస్సులున్నాయి -నా లేటెస్ట్ లుక్ ఇదే - నాగార్జున‌

Nagarjuna new look
ఆత్మకు ఎక్కువ శక్తి ఉంటుందని అంటారు కదా. అని చిన్న‌ప్పుడు నేను చాలాసార్లు విన్నా. ఓ చోట పాము ప‌లానా సంద‌ర్భంలో వ‌స్తుంది అనేవారు. అలాగే చ‌నిపోయిన వారు మ‌న‌ల్ని కాపాడుతుంటారు. నాకు ఆ న‌మ్మ‌కం వుంది. మా నాన్న నాగేశ్వ‌ర‌రావుగారు ఎక్క‌డున్నా పైనుంచి మా కుటుంబాన్ని కాపాడుతూనే వుంటార‌ని మేమంద‌రం న‌మ్ముతాం. మా అన్న‌య్య ఈ విష‌యంలో మ‌రీను. న‌మ్మ‌కం ఎక్కువ‌. బంగార్రాజు సినిమాలో ఆత్మ‌ల కాన్సెప్ట్ పెట్ట‌డానికి కార‌ణం అదే. ఇలాంటివి మ‌న వాళ్ళు బాగా న‌మ్ముతార‌ని.. నాగార్జున తెలియ‌జేశారు.
 
తాజాగా ఆయ‌న ఈ త‌ర‌హా సినిమాలో న‌టిస్తున్నాడు. ఘోస్ట్ అనేది టైటిల్‌. ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి సంబంధించిన నాగార్జున లుక్‌ను అర్థ‌రాత్రి విడుద‌ల చేశారు. ఇందులో నాగార్జున లుక్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. లుక్ చాలా బాగుందని కామెంట్ల తెగ చేసేస్తున్నారు. మా సంక్రాంతి హీరో అంటూ మ‌రికొంద‌రు స్పందిస్తున్నారు.