గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 22 మే 2019 (18:47 IST)

ప్రభాస్‌తో ఎప్పటికైనా హిట్ కొట్టి తీరుతాను: వంశీ పైడిపల్లి

యువ కథానాయకుడు ప్రభాస్‌తో ఎప్పటికైనా హిట్ కొడతానని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. వంశీ తాజాగా దర్శకత్వం వహించిన 'మహర్షి' సినిమా విజయం సాధించిన నేపథ్యంలో ఆయన ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్‌తో సినిమా గురించి వంశీ ప్రస్తావించినట్లు ఓ వెబ్‌సైట్ పేర్కొంది. 
 
అయితే త్వరలోనే ప్రభాస్ కోసం మంచి స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తానని వంశీ అన్నారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆయనతో హిట్ కొడతానని చెప్పారు. దీంతో పాటు ఆయన ప్రభాస్ వ్యక్తిత్వాన్ని కూడా మెచ్చుకున్నారు. ప్రభాస్‌కు మున్నా చిత్రం ద్వారా ఫ్లాప్ ఇచ్చినా, ప్రభాస్ మాత్రం ఎప్పుడూ తనను దూరం పెట్టలేదని, స్నేహంగా ఉన్నారని తెలిపారు.
 
గతంలో ప్రభాస్‌-వంశీ కాంబినేషన్‌లో 'మున్నా' (2007) చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఇలియానా కథానాయికగా నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీనిని ఉద్దేశిస్తూ వంశీ ఇప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడారట. 
 
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి తీసిన ‘మహర్షి’ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. రైతులు, వ్యవసాయం నేపథ్యంలో సామాజిక సందేశంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా విజయం సాధించింది. ప్రస్తుతం వంశీ తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.