మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 23 అక్టోబరు 2020 (16:38 IST)

హిమాలయాల్లో 13 వేల అడుగుల ఎత్తులో 'వైల్డ్ డాగ్'

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం వైల్డ్ డాగ్. ఈ చిత్రం షూటింగ్ కోసం యూనిట్ హిమాలయాలకు వెళ్లింది. అక్కినేని నాగార్జున హిమాలయాల నుంచి ఓ వీడియోను షేర్ చేసారు. ఇక్కడ సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో తను వున్నట్లు చెప్పారు. చిత్రం షూటింగ్ మూడు వారాలు వుంటుందని, అది అయిపోగానే తిరిగి వస్తానన్నారు.
 
కాగా అక్కినేని నాగార్జున బిగ్ బాస్ 4 తెలుగు హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఆయన కోడలు అక్కినేని సమంత వస్తారన్న ప్రచారం జరుగుతోంది.