139 మంది అత్యాచారం కేసు.. డాలర్ భాయ్ అరెస్ట్..
తనపై 139 మంది అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అత్యాచార ఆరోపణలు డాలర్ భాయ్ ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 20న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో డాలర్‌భాయ్‌పై యువతి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే సీసీఎస్ పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి విచారించారు. ఎట్టకేలకు పంజాగుట్ట పోలీసులు డాలర్ భాయ్‌ని అరెస్ట్ చేశారు.
కాగా.. తనపై 139 మంది అత్యాచారం జరిపారంటూ ఓ యువతి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దానిలో సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లను సైతం వెల్లడించింది. పంజాగుట్టలో తనపై 139 మంది అత్యాచారం జరిపారని కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా తనతో డాలర్ భాయ్ చేయించాడని చెప్పి సదరు యువతి షాక్ ఇచ్చింది.
తన పట్ల సైకోలా వ్యవహరించాడని తెలిపింది. తాను చెప్పినట్లు చేయకపోతే తన కుటుంబాన్ని చంపుతామని బెదిరించాడని సదరు యువతి వెల్లడించింది. ఫైనల్‌గా డాలర్ భాయ్‌పై సదరు యువతి కేసు కూడా నమోదు చేసింది.