సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (13:29 IST)

అలనాటి గ్లామర్ నటి దీప ఫోటోలు సోషల్ మీడియాలో స్పందన

senior actress deepa family
senior actress deepa family
శరత్ బాబు, మోహన్ బాబు లతో నటిగా గ్లామర్ పాత్రలు పోషించిన సీనియర్ నటి దీప ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎర్నాకులం, కేరళలో పుట్టిన ఈమెకు అంబిక, గీత షోమా ఆనంద్ సిస్టర్స్. వారూ నటీమణులే. 59 ఏళ్ల దీపా 1982లో కాలేజీ ప్రొఫెసర్ రిజోయ్‌ను వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు నిర్మల్ అనే కుమారుడు. ఇప్పడు మనవడు ఉన్నాడు. మనవడి పుట్టినరోజున ఫామిలీ ఫోటోలు బయటకు వచ్చాయి. 
 
కె. భాగ్యరాజ్ నటించిన ‘ముంతనై ముడిచు’లో గ్లామర్ టీచర్‌గా నటించిన నటి దీప తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీపా అసలు పేరు ఉన్ని మేరీ. నటి దీప గా  1975లో కమల్ హాసన్ నటించిన ‘అంతరంగం’తో నటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత కమల్‌హాసన్‌తో ‘ఉల్లాస పర్సెన’, రజనీకాంత్‌తో కలిసి ‘జానీ’ వంటి పలు చిత్రాల్లో నటించింది.
 
క్లాసికల్ డాన్సర్ గా విదేశాల్లో పలు షోలు చేసింది. ఇప్పుడు నటి దీప అందమైన కుటుంబ ఫోటోలు ఇప్పుడు నెట్‌లలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల లైక్‌లు మరియు కామెంట్‌లు తెగ పెడుతున్నారు.