బుధవారం, 6 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 5 ఆగస్టు 2025 (14:26 IST)

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

Sonu Sood, Suresh Shukla, Shravan Ghanta, Miss India Manasa
Sonu Sood, Suresh Shukla, Shravan Ghanta, Miss India Manasa
భారతదేశంలో అత్యంత పారదర్శకమైన, ల్యాబ్-పరీక్షించిన, అమెరికా ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన హెల్త్ సప్లిమెంట్లను అందించాలనే లక్ష్యంతో 'ఆల్ఫాలీట్' (Alphlete) బ్రాండ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. నగరంలోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగిన ఈ గ్రాండ్ లాంచ్ వేడుకలో 'ఇండియన్ రియల్ హీరో' సోనూ సూద్ ముఖ్య అతిథిగా పాల్గొని, 'ఆల్ఫాలీట్' బ్రాండ్‌ను ఆవిష్కరించారు.
 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోనూసూద్ తో పాటు మిస్ ఇండియా మానస ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. "Authentic - Exclusive - Performance" అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చిన ఆల్ఫాలీట్, ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అత్యుత్తమ సప్లిమెంట్లను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.
 
 ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.."ఆల్ఫాలీట్ వంటి ఒక అద్భుతమైన బ్రాండ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఫౌండర్లు సురేష్ శుక్లా, శ్రవణ్ ఘంటలకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ రోజుల్లో యువత ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ చూపుతోంది. అయితే, మార్కెట్లో కల్తీ సప్లిమెంట్ల బెడద కూడా అదే స్థాయిలో పెరిగింది. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. సరైన సప్లిమెంట్స్ తీసుకోకపోతే ఆరోగ్యానికి మేలు జరగకపోగా, తీవ్రమైన హాని కలిగే ప్రమాదం ఉంది.
 
ఇలాంటి సమయంలో, పూర్తి పారదర్శకతతో, ల్యాబ్-టెస్టులు చేసి, అమెరికా ప్రమాణాలతో నాణ్యమైన ఉత్పత్తులను అందించాలనే ఆల్ఫాలీట్ సంకల్పం ప్రశంసనీయం. ఫిట్‌నెస్‌లో సప్లిమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి, కానీ సరైనవి ఎంచుకోవడం అంతకంటే ముఖ్యం. ఆల్ఫాలీట్ నాణ్యత విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ, వినియోగదారుల పట్ల వారికున్న బాధ్యతను తెలియజేస్తుంది.
 
ఫిట్‌నెస్ ఔత్సాహికులు, యువత సరైన సమాచారంతో, నమ్మకమైన బ్రాండ్లను ఎంచుకోవాలి. ఆల్ఫాలీట్ ఆ నమ్మకాన్ని నిలబెడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ బ్రాండ్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను," అని అన్నారు.
 
ఆల్ఫాలీట్ ఫౌండర్ & సీఈఓ సురేష్ శుక్లా మాట్లాడుతూ, "భారతదేశ సప్లిమెంట్ మార్కెట్‌లో విశ్వసనీయత, పారదర్శకత కొరవడింది, ఈ లోటును పూడ్చేందుకే ఆల్ఫాలీట్‌ను స్థాపించాం. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి, ఫిట్‌నెస్, బాడీబిల్డింగ్‌పై ఉన్న మక్కువతో, భారతీయ వినియోగదారులకు 100% అసలైన, క్యూఆర్-కోడ్ వెరిఫైడ్, యూఎస్ ప్రమాణాలతో కూడిన ల్యాబ్-టెస్టెడ్ సప్లిమెంట్లను అందించాలనే లక్ష్యంతో ఈ బ్రాండ్‌ను ప్రారంభించాం" అని వివరించారు.
 
ఆల్ఫాలీట్ కో-ఫౌండర్, సీఎఫ్ఓ శ్రవణ్ ఘంట మాట్లాడుతూ, "సురేష్ శుక్లా ఆలోచన, ఆశయం నచ్చి ఈ ప్రయాణంలో భాగస్వామి అయ్యాను. నాణ్యత విషయంలో రాజీలేని, సమాజ శ్రేయస్సును కాంక్షించే నమ్మకమైన బ్రాండ్‌ను నిర్మించడమే మా ధ్యేయం. ఆల్ఫాలీట్ కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యానికి, సాధికారతకు పాటుపడే ఒక ఉద్యమం" అని పేర్కొన్నారు.
 
పూర్తిగా ల్యాబ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే తమ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయని, నాణ్యతలో అమెరికా ప్రమాణాలను పాటిస్తామని నిర్వాహకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగింది. పలువురు ఫిట్‌నెస్ నిపుణులు, హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో #iamalphalete అనే హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అవుతున్నాయి.