బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2023 (15:57 IST)

మెగా టైటిల్ తో హీరో అవుతున్న యూట్యూబర్ హర్ష సాయి

megamovie team
megamovie team
మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగిన పాపులర్ యూట్యూబర్, ఫిలాంత్రోపిస్ట్ హర్ష సాయి పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రంతో బిగ్ స్క్రీన్‌లోకి అడుగుపెడుతున్నారు. హర్ష సాయి స్వయంగా రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ పిక్చర్స్ బ్యానర్‌పై మిత్ర నిర్మించారు. ఈ సినిమాలో మిత్ర హీరోయిన్ గా కూడా నటిస్తున్నారు. కల్వకుంట్ల వంశీధర్‌రావు సమర్పిస్తున్న ఈ చిత్రానికి పడవల బాలచంద్ర సహ నిర్మాత.
 
ఈరోజు చిత్ర యూనిట్ నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ లో టీజర్ ద్వారా సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.  పాన్ ఇండియా స్థాయిలో భారీగా రూపొందుతున్న ఈ చిత్రానికి  ‘మెగా’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. లో డాన్ అనేది ట్యాగ్‌లైన్. టీజర్ సినిమా ప్రిమైజ్ ని పరిచయం చేస్తుంది. వేలాడుతున్న భారీ గంట ఎంత ప్రమాదకరమో డాక్టర్ తన డ్రైవర్‌కి వివరించడంతో టీజర్ ప్రారంభమవుతుంది. అతని చుట్టూ భారీ గుంపుతో హీరోని తాళ్లతో కట్టివేసారు.
 
ఒక వ్యక్తిని కట్టి, తలక్రిందులుగా వేలాడదీసి, గంట మోగినప్పుడు, అతడు మెదడు గాయంతో చనిపోతాడు. కానీ హీరో ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోడు. హీరోని తిమింగలంతో పోలుస్తూ.. అతడికి 100 సింహాల బలం ఉందని చెప్పినపుడు.. మెగా లో డాన్ గా పరిచయం అవుతారు. ఈ కథ రాక్షసులతో నిండిన సముద్రాన్నే కుదిపేసే రాజైన మనిషిది. అతని తెలివితేటలు అపారం.
 
టీజర్‌లో హర్ష సాయికి కావల్సినంత ఎలివేషన్స్ ఇచ్చారు, దీని ద్వారా పాత్ర పవర్ ని మనం ఊహించవచ్చు. యంగ్ స్టర్ తన అరంగేట్రంలో గొప్ప ముద్ర వేశాడు. హీరోని చంపడానికి ప్రయత్నించే వ్యక్తి గ్రహాంతరవాసిలా కనిపిస్తున్నారు. ఓవరాల్‌గా, టీజర్ కాన్సెప్ట్ , ప్రెజెంటేషన్ మైండ్ బ్లోయింగ్ గా వుంది.
 
హీరో, దర్శకుడు హర్ష సాయి మాట్లాడుతూ.. మానవ మెదడు కథలను గుర్తుంచుకోవడానికి డిజైన్ చేయబడింది. మంచి కథలు చెప్పడానికి ప్రస్తుతం ఉన్న పెద్ద మాధ్యమం సినిమా. అదే నేను సినిమా ఎంచుకోవడానికి కారణం. విజయవంతమైన సినిమాలు చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని ఓ వ్యక్తి నాతో చెప్పాడు. ఇది కూడా నిజమే. నేను ఎక్కువ ఇవ్వాలనుకుంటే, ఎక్కువ డబ్బు సంపాయించాలి. నేను సినిమాలు చేయడానికి మరో కారణం యువ ప్రతిభను ప్రోత్సహించడం. టైటిల్, టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మంచి టెక్నికల్ టీంతో ఈ సినిమా చేస్తున్నాం. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ, అంజి మాస్టర్ ఫైట్స్ అద్భుతంగా వుంటాయి’’ అన్నారు.
 
2024లో విడుదల కానున్న  ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌కి కార్తీక్ పళని సినిమాటోగ్రఫర్ గా పని చేస్తుండగా, వికాస్ బాడిసా సంగీతం అందిస్తున్నారు.