శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (21:42 IST)

వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, భార్య పాత్రలో నయనతార 'యాత్ర'

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో... ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు వరుసగా అధికారంలోకి తెచ్చి తన సత్తాను చాటిన వైఎస్ రాజశేఖర రెడ్డి అనగానే ఆయన పాదయాత్ర గుర్తుకు వస్తుంది. రైతుల సమస్యలను తెలుసుకునేందుక

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో... ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు వరుసగా అధికారంలోకి తెచ్చి తన సత్తాను చాటిన వైఎస్ రాజశేఖర రెడ్డి అనగానే ఆయన పాదయాత్ర గుర్తుకు వస్తుంది. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారాయన. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాల గురించి ఇప్పటికీ జనం చర్చించుకుంటుంటారంటే ఆయనపై ప్రజల్లో ఎలాంటి గుర్తింపు వుందో వేరే చెప్పక్కర్లేదు. 
 
ఈ నేపధ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ తీయాలన్న చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. వైఎస్సార్ పాత్రలో తెలుగు హీరోలయితే నప్పరని, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని సంప్రదించారనీ, ఆయనకు వైఎస్సార్ చరిత్ర మొత్తం చెప్పి సినిమాలో నటింపజేసేందుకు అంగీకరింపజేసినట్లు తాజా సమాచారం. ఈ చిత్రంలో మమ్ముట్టి సరసన నయనతార నటించనుంది. కాగా ఈ సినిమాకు యాత్ర అనే పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.