రాజారెడ్డిగా జగపతి బాబు... వైఎస్సార్‌గా మమ్ముట్టి... మరి జగన్ ఎవరు?
తెలుగు వాళ్ల గుండెల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పాదయాత్రలో ముఖ్య ఘట్టాలతో నిర్మిస్తున్న చిత్రం యాత్ర. వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు మహి వి రాఘవ్ ఈ యాత్రని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రాన్ని భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్యయంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషన్ మెటీరియల్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైయస్ రాజారెడ్డి గారి పాత్రలో జగపతి బాబు నటించారు. వైయస్ రాజారెడ్డి గారి లుక్‌లో జగపతి బాబు అతికినట్లు సరిపోయారు.
ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ… మహనాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి చేసిన పాదయాత్ర నేపధ్యాన్ని తెరకెక్కిస్తున్న చిత్రం యాత్ర. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లోని పేద ప్రజల, రైతుల బాధలు నేరుగా వినటానికి కొనసాగించిన సమరశంఖం ఈ యాత్ర. చాలామటుకు రియలిస్టిక్‌గా చూపించటానికి మా దర్శకుడు మహి ప్రయత్నించారు. వైయస్ఆర్ పాత్రలో మమ్ముట్టి గారు అద్భుతంగా నటించారు.
మమ్ముట్టి గారు డెడికేషన్‌తో చేశారు. ఆయనే తెలుగులో డబ్బింగ్ చెప్పటం విశేషం. మా బ్యానర్లో భలేమంచిరోజు, ఆనందోబ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర చిత్రం హ్యాట్రిక్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్‌తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి గారు వైయస్ రాజారెడ్డి గారి పాత్రలో జగపతిబాబు గారు నటించారు. పాత్ర చిన్నదైనా చాలా ముఖ్య పాత్ర కావటంతో మేము అడిగిన వెంటనే అంగీకరించిన జగపతిబాబు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రం ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మళయాల భాషల్లో విడుదల చేస్తాం అని అన్నారు.
ఇకపోతే వైఎస్సార్ కుమారుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు కనిపిస్తారన్న చర్చ సాగుతోంది. ఆయన పాత్రలో ఆయనే కనబడతారనే టాక్ వినిపిస్తోంది. మరి ఎవరిని చూపిస్తారో చూడాలి.