ఆ రాయి రెండు లచ్చలు... తెలుసా?

jokes
Last Updated: శుక్రవారం, 26 జులై 2019 (15:28 IST)
ఒక ఉంగరం వేలుకి పెట్టుకుని తిరుగుతున్నాడు రంగారావు.

ప్రతి ఒక్కరూ ఆ ఉంగరం చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఆ ఉంగరంలో రాయి... అదోలా ఉంది!

ఉండబట్టలేక రంగారావును అతని స్నేహితులు అడిగారు...

'మిత్రమా... ఉంగరం అదుర్స్.... కానీ ఈ రాయి బాగోలే..' అని.

'హు... ఈ రాయి 2 లచ్చల రూపాయలు. తెలుసా?' అన్నాడు.

'అబ్బో... అంత ఖరీదా??... అసలు ఇది ఏ రాయి?'

'మొన్న ఆపరేషన్ చేపించుకున్నాను... నా కిడ్నీలోది..... బిల్లు 2 లచ్చలు వేశారు. తెలుసా మరీ!!!.దీనిపై మరింత చదవండి :