శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (21:22 IST)

నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?

రాజు: అతనేంటి పేరడిగితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవైపు చూపించి వెళ్ళి పోతున్నాడు?
సోము: ఓ.... అతనా! అతని పేరు ఏడుకొండలు. సోమవారం రోజున ఆయన మౌనవ్రతం లెండి, మాట్లాడడు.
 
2. బడికి ఇవాళ ఆలస్యమయ్యిందేంటి రా! అడిగారు టీచర్ స్టూడెంట్‌ని.
 విద్యార్థి: బడికి ఆలస్యంగా రానని.. వందసార్లు ఇంపోజిషన్ రాయమన్నారుగా. అది రాయటం వల్లే ఆలస్యం అయ్యింది సార్, చెప్పాడు స్టూడెంట్.