1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2024 (19:31 IST)

గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామా నేపథ్యంగా1134 మూవీ రివ్యూ

1134 Movie release poster
శరద్ చంద్ర తడిమేటి దర్శకత్వం వహించిన చిత్రం 1134 .  హైదరాబాద్‌లోని నిజ జీవితంలో జరిగిన ATM దోపిడీల నుండి ప్రేరణ పొందిన క్రైమ్ డ్రామా. ఈ చిత్రం గ్రిప్పింగ్ ప్యాట్రన్‌తో వరుస దోపిడీల శ్రేణిని తెలియజేస్ప్రేతుంది. వీక్షకులకు ఉత్కంట రేకెత్తించేలా వుండబోతుందని టీజర్, ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించడంతో సినిమా మీద బజ్ ఏర్పడింది. జనవరి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్తవారితో చేసిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం. 
 
కథ
11 34 అనే కథ ఓ ముగ్గురి మధ్య జరుగుతుంది. లక్ష్మణ్ (ఫణి శర్మ), ఎరిక్ (గంగాధర్ రెడ్డి), హర్ష్ (ఫణి భార్గవ్)అనే ముగ్గురు ఒక్కో విధంగా దొంగతనాలు చేస్తుంటారు. ఏటీఎం వద్ద ఉండే కెమెరాలు హ్యాక్ చేయడం, బస్ స్టాప్‌లో వద్ద కనిపించే బ్యాగులను దొంగతనం చేయడం, ఏటీఎంలో ఇల్లీగల్‌గా డబ్బులు తీయడం వంటివి ఈజీగా చేసేస్తుంటారు. అలాంటి ముగ్గురిని ఓసారి కిడ్పాప్ చేసి ఒకే దగ్గర కట్టి పడేస్తారు. ఆ తర్వాత ఏమి జరిగింది? ఈ కథలో 11 34 అంటే ఏంటి? చివరకు ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు? అన్నది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
క్రైం సస్పెన్స్ అంశాలతో ముడిపడి వున్న ఈ కథ చాలా సింపుల్ గా తాము అనుకున్న ఫార్మెట్ లో దర్శకుడు తీయగలిగాడు. నటీనటులు కృష్ణగా (కృష్ణ మదుపు), ఎరిక్‌గా (గంగాధర్ రెడ్డి), హర్షగా (ఫణి భార్గవ్), లక్ష్మణ్‌గా (ఫణి శర్మ) కొత్త వారు కావడంతో సహజంగా కనిపిస్తుంటారు. కథనంలో యాక్షన్, ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌ను చూపించారు.
 
ఒకరకంగా చెప్పాలంటే ఇటువంటి సినిమా చేయాలంటే సాహసమే. దానిని దర్శకుడు శరద్ చంద్ర తడిమేటి ఎంచుకున్న పాయింట్‌ నుంచి ఏ మాత్రం కూడా డైవర్ట్ కాకుండా తీశాడు. అందుకు కెమెరా యాంగిల్స్,అట్మాస్ఫియరిక్ సినిమాటోగ్రఫీ వినియోగం దృశ్యపరంగా అద్భుతమైన అనుభవాన్ని సృష్టిస్తుంది, హీస్ట్ సీక్వెన్స్‌ల మొత్తం తీవ్రతను పెంచుతుంది. తాడిమేటి దర్శకత్వ చక్కదనం చిత్రానికి హుందాతనాన్ని జోడించింది. సౌండ్ డిజైన్ మొత్తం సినిమా అనుభవాన్ని మెరుగుపరుస్తుంది,
 
సెకండాఫ్‌కు వచ్చే సరికి చిక్కుముడులన్నీ విప్పినట్టుగా ఉంటాయి. ఆ ముగ్గురి వెనుకున్నది ఎవరు? ఆ క్రైమ్స్‌ను చేయిస్తున్నది ఎవరు? దీని వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ద్వితీయార్దాన్ని తీసుకెళ్తాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చే సరికి కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా ప్రేక్షకుడ్ని థ్రిల్ చేయడంలో మాత్రం 1134 సక్సెస్ అవుతుంది.
 
1134 అనేది చిన్నపాటి లోపాలున్నాయని అనిపించినా అవికనబడకుండా కథనంలో మాయ చేశాడు. చక్కటి సినిమా అనుభవం, ఇది నిజ జీవిత సంఘటనలను విజయవంతంగా ఆకట్టుకునే కథనంలోకి తీసుకెళ్ళాడు. ATM దోపిడీల కథ విప్పినప్పుడు, 1134 ప్రేక్షకులను చివరి వరకు ఊహించేలా చేస్తుంది. గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారు తప్పక చూడవలసినది. 
రేటింగ్ : 2.75/5