సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (19:05 IST)

''జగమే తంత్రం" రివ్యూ రిపోర్ట్: గ్యాంగ్‌స్టర్ అవుదామని ధనుష్ లండన్‌కు వెళ్తే..?

Danush
సినిమా పేరు.. జగమే తంత్రం 
నటీనటులు : ధనుష్, ఐశ్వర్య లక్ష్మీ, జోజు జార్జ్, జేమ్స్ కాస్మో, కలైరాసన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ క్రిష్ణ
మ్యూజిక్: సంతోష్ నారాయణన్
ఎడిటింగ్: వివేక్
నిర్మాతలు: శశికాంత్, రామచంద్ర
రచన,దర్శకత్వం: కార్తిక్ సుబ్బరాజ్
రిలీజ్ డేట్: జూన్ 18,2021
 
కథలోకి వెళ్తే..?
మదురైలో చిన్న చిన్న దందాలు, మర్డర్లు చేసుకుంటూ ఉండే సురులి (ధనుష్) శత్రువుల తాకిడి తట్టుకోలేక తెలిసిన వాళ్ల సాయంతో గ్యాంగ్ స్టర్ అవుదామని లండన్‌కు వెళ్తాడు. అక్కడ పీటర్ (జేమ్స్ కాస్మో) అనే ఫారిన్ గ్యాంగ్ స్టర్ టీమ్‌లో చేరుతాడు. పీటర్‌కు పోటీగా ఉన్న మరో తమిళ గ్యాంగ్ స్టర్ శివదాస్ (జోజు జార్జ్)కు సాయం చేస్తానని చెప్పి అతన్ని చంపుతాడు సురులి. ఆ తర్వాత పరిణామాలు మారిపోతాయి. శివదాస్ తమిళ శరణార్థుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు.ఆ తర్వాత సురులి ఏం చేశాడు. పీటర్‌కు ఎదురు తిరిగాడా? తమిళుల కోసం పోరాడి వారిని రక్షించాడా లేదా అన్నది స్టోరీ.
 
నటీనటుల పర్ఫార్మెన్స్:
సురులి అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో అలరించాడు ధనుష్. కథనం బోర్ కొట్టించిన ప్రతిసారీ తన కామిక్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఐశ్వర్య లక్ష్మీకి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర దక్కింది.డాన్ పాత్రలో నటించిన జోజు జార్జ్, జేమ్స్ కాస్మో ఇద్దరూ ఆకట్టుకున్నారు. 
Danush
 
టెక్నికల్ వర్క్:
టెక్నికల్ టీమ్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ గురించి. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సీన్లను బాగా ఎలివేట్ చేశాడు. పాటల్లో ఒకట్రెండు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండాల్సింది. యాక్షన్ సీన్లు బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూవ్స్ రిచ్‌గా ఉన్నాయి. ధనుష్ నోటి వెంట వచ్చిన కొన్ని డైలాగులు బాగా పేలాయి.
 
విశ్లేషణ:
జగమే తంత్రం బోరింగ్‌గా సాగే గ్యాంగ్ స్టర్ డ్రామా. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ స్టైలిష్‌గా తీద్దామనుకునే క్రమంలో సరైన కథనం, కథ అనుకులేనట్టున్నాడు. ఫస్టాఫ్ వరకు కథలోకి వెళ్లకుండా విసిగిస్తే.. సెకండాఫ్‌లో అందరూ ఊహించనట్టే సాగడంతో నీరసం వస్తుంది. కేవలం ధనుష్ వల్లే అక్కడక్కడ కొంత ఉపశమనం లభిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. 
Danush
 
ఈ రెండు ప్లస్ పాయింట్ లు తప్ప చెప్పుకోడానికి ఏం లేదు. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ చేసి ప్రొడ్యూసర్ లాభపడ్డాడనే చెప్పాలి. లేకపోతే థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే మాత్రం ఆడియన్స్ తట్టుకోలేకపోయేవారు. కార్తిక్ సుబ్బరాజ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి ఇలాంటి స్టఫ్ ఊహించలేం. ఓవరాల్‌గా అంచనాలన్ని తలకిందులు చేస్తూ "జగమే తంత్రం" బాగా నిరాశపరుస్తుంది.